calender_icon.png 19 March, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్‌లో ప్రొటోకాల్ వివాదం

18-03-2025 12:44:11 AM

 *బీజేపీ కార్పొరేటర్ల శంకుస్థాపన అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు 

* అరెస్టు చేసిన హయత్‌నగర్ పోలీసులు 

ఎల్బీనగర్, మార్చి 17 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొన్నిరోజులుగా ప్రోటోకాల్ వివాదం రగులుకున్నది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు మధ్యన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలపై వివాదం రాజుకున్నది. తాము అధికారుల చుట్టూ తిరిగి నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులను పూర్తి చేస్తే... చివరిలో మాకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభిస్తారా? అని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహరెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు.

అయితే, ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దీనికి ముందు రోజు జీహెచ్‌ఎంసీ అధికారులు బీజేపీ కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చారని, ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి పాల్గొనలేదు. దీంతో ఎమ్మెల్యే ఆయా పనులను ప్రారంభించారు.

దీనిపై కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చేసిన శంకుస్థాపన కార్యక్రమాన్ని సోమవారం మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి డివిజన్ లోని వీరన్న గుట్టలో పర్యటించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్  నాయకులు జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి నిరసన తెలిపారు. వీరిపై కార్పొరేటర్ నర్సింహారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో  హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేసి వారిని అరెస్టు చేసి, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ కు  తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, సాగర్ రెడ్డి, పద్మా నాయక్, భవానీ ప్రవీణ్ ఇతర నాయకులు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ వెళ్లి బీఆర్‌ఎస్ నాయకులను పరామర్శించారు.