06-04-2025 10:23:56 AM
కేటగిరి వారిగా విభజించి డిస్ప్లే చేసిన అధికారులు
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఆదివారం జరిగే సీతారాముల కళ్యాణం వీక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, జ్యూడిషియల్ అధికారులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులుతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజా ప్రతినిధులు నిధులు వస్తున్నారు. వారందరికీ ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా నివారించడానికి తొలిసారి జిల్లా యంత్రాంగం విఐపి సెక్టార్లో ఎవరు ఎక్కడ కూర్చోవాలో బోర్డుల ద్వారా డిస్ప్లేస్ చేశారు. అయితే ఈసారి ఫోటో కాల్ ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు చెబుతుండగా వచ్చే మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ అధికారుల మాట ఏమాత్రం వింటారో వేచి చూడాల్సిందే.
గతంలో మంత్రులు ప్రజాప్రతినిధులు వారితోపాటు వారి బందు వర్గాలను, పార్టీ నాయకులను తీసుకుని వచ్చి అధికారులు ఎంత చెప్పినా వినకుండా విఐపి గ్యాలరీ కి వెళ్లేవారు. ఆ సమయంలో అధికారులు ఏమి చేయలేని స్థితిలో ఉండేవారు. ఒకానొక దశలో విఐపి గాలరీ కూడా నిండిపోయి భక్తులు టిక్కెట్ కొనుక్కునే గ్యాలరీలను ఆక్రమించేవారు. దీంతో టికెట్లకు కొనుక్కున్న వారి గ్యాలరీల కూడా నిండిపోయాయి. దాంతో టికెట్లు కొనుక్కున్నవారు గ్యాలరీ లో వారి కేటాయించిన చోటు లేక బయట ఎండలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈసారి అధికారులు కచ్చితంగా ప్రోటోకాల్ మాత్రమే అమలు చేస్తామని, టికెట్లు కొనుక్కున్న వారికి వారి గ్యాలరీలకు అనుమతిస్తామని చెబుతుండటంతో కళ్యాణం సమయంలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.