హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లకు నిరసనగా గురువారం అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహ నం చేయాలని బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు గౌరవస్థానం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆ సోయి లేకుండా మహిళా నేతలపై నోరుపారేసుకున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మన్ననలు, ఆదరణతో అసెంబ్లీలో అడుగుపెట్టిన సీనియర్ మహిళ సభ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఆ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా నేతలకు క్షమాపణ చెప్పాలన్నారు.