న్యూఢిల్లీ, నవంబర్ 23: కెనడాలోని మిలీ పార్క్‌డౌన్‌టౌన్ వద్ద నాటో సభ్యదేశాల ప్రతినిధులు ఉన్నతస్థాయి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనగా.. సమావేశం వెలుపల ఇజ్రాయెల్, నాటోకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు కిటికీలు పగులగొట్టడంతో పాటు పోలీసు అధికారులతో గొడవపడి పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
ఈ క్రమంలో నలుగురిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఉక్రెయిన్, వాతావరణ మార్పులు, కూటమి భవిష్యత్‌పై దృష్టి సారించిన మాంట్రియల్‌లో నవంబర్ 22 నుంచి 25 వరకు జరిగే అత్యున్నత స్థాయి శిఖరాగ్ర సమావేశానికి నాటో సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి దాదాపు 300మంది ప్రతినిధుల రాకను వ్యతిరేకిస్తూ అక్కడ హింస చెలరేగింది.