calender_icon.png 15 November, 2024 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలపై 18 నుంచి నిరసనలు

15-11-2024 01:26:43 AM

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి):రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను రాష్ట్రప్రభుత్వం విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈనెల 18వ తేదీ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్, గిరిజన సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు నిరసన కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.

కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో సోషల్ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ శాఖల సహకారంతో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద  9 వేల మంది ఎస్సీ పిల్లలు, 6 వేల మంది ఎస్టీలు చదువుకుంటున్నారని తెలిపారు. సర్కార్ విద్యాసంస్థల యాజమాన్యాలకు రెండేళ్ల నుంచి ఫీజులు చెల్లించడం లేదన్నారు. గత ప్రభుత్వం ఎనిమిది నెలలు ఫీజు చెల్లించలేదని, అలాగే ప్రస్తుత  ప్రభుత్వం కూడా ఫీజులు విడుదల చేయడం లేదన్నారు. బకాయిల విడుదల కోసం తమ సంఘాలు ఉమ్మడి పోరాటం చేస్తాయని ప్రకటించారు.