calender_icon.png 29 December, 2024 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాలో మళ్లీ నిరసనలు

24-10-2024 01:35:35 AM

అధ్యక్షుడు షహబుద్దీన్ రాజీనామాకు డిమాండ్

ఢాకా, అక్టోబర్ 23: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనా మా చేసి, బంగ్లాదేశ్‌ను వీడగా, తాజా గా ఆ దేశంలో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్‌మినార్‌లో ఉన్న బంగ్లాదేశ్ అధ్యక్షుడి భవనాన్ని ముట్టడించిన నిరసనకారులు ఆయన రాజీ నామా చేయాలంటూ డిమాండ్ చేశా రు. ఈ సందర్భంగా నిరసనకారులు పలు డిమాండ్లను తెరమీదకు తీసుకొచ్చారు. ‘షేక్‌హసీనా ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడైన అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలి.ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి. 1972లో రా జ్యాంగాన్ని రద్దు చేసి.. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలి. అవామీ లీగ్ పార్టీకి చెందిన బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్‌ను నిషేధించాలి. జులై జరిగిన నిరసనల స్ఫూర్తికి అనుగుణంగా హ సీకనా ప్రభుత్వ ఛాయలు లేకుండా బంగ్లాదేశ్‌ను రిపబ్లిక్‌గా ప్రకటించాలి ’అని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మ క ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.