calender_icon.png 28 April, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడిపై నిరసన జ్వాలలు

26-04-2025 01:09:35 AM

సూర్యాపేట, ఏప్రిల్25(విజయక్రాంతి): కశ్మీర్లో పర్యాటక కేంద్రమైన పహల్లామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడికి వ్యతిరేఖంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు.  వివిద పార్టీలు, సంఘాల ఆద్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉగ్రదాడిని వారు ఖండించారు. 

ముస్లిం మైనార్టీ, సీపీఎం ఆద్వర్యంలో కాశ్మీర్ లోని పహాల్గామాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇలాంటి ఉగ్ర దాడులను ప్రతి ఒక్కరూ  ఖండించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి ఖాలేద్ అహ్మద్ అన్నారు.

పహల్గామ ఉగ్రవాదుల దాడికి నిరసనగా సిపిఎం పార్టీ మరియు ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు సెంటర్లో క్యాండిల్స్ ప్రదర్శన నిర్వహించి అమరులైన వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. ప్రతి ఉగ్రదాడికి మతం రంగు పులిమి దేశంలో మత వైశ్యామ్యాలు సృష్టించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, ముస్లిం మైనారిటీ నాయకులు ఫక్రుద్దీన్ షేక్ అబ్దుల్లా అసరా సాహెబ్, అత్తర్ సాహెబ్,తదితరులు పాల్గొన్నారు. 

అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆద్వర్యంలో 

జమ్మూ కాశ్మీర్  పహాల్గాం వద్ద యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన మరణ హోమం హేయమైన చర్య ఉగ్రవాదం దేశానికి ప్రమాదకరమని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవిఎల్ అన్నారు. శుక్రవారం పట్టణంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉగ్రవాదం దిష్టిబొమ్మను డీమార్ట్ సెంటర్లో తగలబెట్టారు.ప్రపంచ శాంతి గురించి, మానవ హక్కుల గురించి పోరాడాలన్నారు. 

సీపపీఐ ఆధ్వర్యంలో...

జమ్ము కాశ్మీర్ పహల్గాం యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో మృతి చెందిన కుటుంబాలకు దేశ ప్రజలు అండగా నిలవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కామ్రేడ్ ధర్మ బిక్షం భవనంలో కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం సందర్భంగా ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బ తీసేందుకు చేసిన దాడి పిరికి పందల చర్య అని విమర్శించారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ..

కాశ్మీరు లోని పర్యాటక ప్రాంతం పహల్గామ్ నందు పర్యాటకులను ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్చిచంపడాన్ని నిరసిస్తూ  స్ధానిక కొత్త బస్టాండ్ వద్ద సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు  కొవ్వొత్తులతో  నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో   పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు అంజద్ ఆలి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ లు మాట్లాడుతూ కాశ్మీర్ లోని పహల్గమ్ నందు ప్రశాంతమైన వాతావరణంలో వుండె పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడిచేసి టూరిస్ట్ లను చంపడాన్ని పిరికిచర్యగా అభివర్ణించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చింతమల్ల రమేష్, అనురాధ కిషన్ రావు, పోలగాని బాలు గౌడ్,  అబ్దుల్ రహీం, కరిముల్లా బేగ్, తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండ..

దేవరకొండ, ఏప్రిల్ 25: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల దాడి మానవత్వానికి మాయని మచ్చ అని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని జమియత్ ఉలేమా నేత మహ్మద్ ముఫ్తి జావిద్ హుస్సేన్, ఈద్గా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజీమోద్దీన్ అన్నారు. శుక్రవారం దేవరకొండలో స్థానిక మక్కా మస్జీద్ చౌరస్తా వద్ద పెహాల్గామ్  ఉగ్రదాడిని ఖండిస్తూ ముస్లింలు మానవహారం చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. అమాయక పౌరులను హతమార్చడం  దారుణమ న్నారు. దేశంపై దాడి జరిగి ఓ వైపు తల్లడిళ్లు తుంటే.. దీన్ని రాజకీయ ఉనికి కోసం కొ ందరు వాడుకోవడం ఆందోళన కలిగిస్తుం దన్నారు. ఉగ్రవాదుల  దాడిలో మరణిం చిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఇలాంటి ఘాతూకానికి పాల్ప డ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.  మహ్మద్ ఫరూఖ్ మౌలానా, సయ్యద్ మాజీద్ మౌలానా, మహ్మద్ రహత్ అలీ, మహ్మద్ ఇలియాస్ పటేల్, మహ్మద్ ఖాజా మైనొద్దీన్,  మాజీ కౌన్సిలర్లు తౌఫిక్ ఖాద్రి, యండి ఇల్యాస్ తదితరులు పాల్గొన్నారు.