డంప్‌యార్డుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు
పటాన్‌చెరు, ఫిబ్రవరి 7: సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లో డంప్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నల్లవల్లి, ప్యారానగర్ మండల ప్రజలు చేస్తున్న నిరసనలు మూడో రోజుకు చేరాయి. శుక్రవారం ఉదయం నల్లవల్లి గ్రామంలో గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు.
అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. డంప్‌యార్డును రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని మండల ప్రజలు తెలిపారు. మరోవైపు పోలీసులు గుమ్మడిదల, నల్లవల్లి గ్రామాల్లో భారీగా మోహరించారు.
ప్యారానగర్‌లో ఏర్పాటు చేస్తున్న డంప్‌యార్డును పూర్తిగా నిలిపేయాలని గుమ్మడిదల రైతు సంఘం నాయకులు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ కమాండెంట్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు.