15-02-2025 06:11:27 PM
డంపింగ్ యార్డ్ ముట్టడించేందుకు యత్నించిన మహిళలు, అడ్డుకున్న పోలీసులు
పటాన్ చెరు,(విజయక్రాంతి): గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా మండల ప్రజలు చేపట్టిన నిరసనలు శనివారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. గుమ్మడిదలలో నిన్న ట్రాక్టర్లతో నిరసన తెలిపిన ప్రజలు నేడు ఆటోలతో నిరసన తెలిపారు. బొంతపల్లిలో ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. నల్లవల్లిలో రిలే నిరాహార దీక్షలో అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. గుమ్మడిదలలో ముస్లింలు రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. కొత్తపల్లిలో నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ప్యారానగర్ లో ఏర్పాటు అవుతున్న డంపింగ్ యార్డ్ ను మహిళలు ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొన్నది. డంపింగ్ యార్డ్ ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.