డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నల్లవల్లి, ప్యారనగర్ గ్రామస్తుల ధర్నా, ఆందోళనలు
పోలీస్ ల భారీ బందోబస్తు
పటాన్ చెరు,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో డంప్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల మండల ప్రజలు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరాయి. శుక్రవారం నల్లవల్లి గ్రామంలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. డంప్ యార్డ్ ఏర్పాటును నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్యారానగర్, నల్లవల్లి గ్రామాలను కాపాడాలని...పంటలను, పర్యావరణాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. పోలీస్ లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలానగర్ - మెదక్ జాతీయ రహదారిపై నల్లవల్లి చౌరస్తాలో పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి.