calender_icon.png 19 November, 2024 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ ప్రధాని నివాసాన్ని ముట్టడించిన ఆందోళన కారులు

05-08-2024 03:11:26 PM

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని నివాసాన్ని ఆందోళన కారులు ముట్టడించారు. ఢాకా ప్యాలెస్ వీడి ప్రధాని సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బెంగాల్ వెళ్తున్నట్లు సమాచారం. షేక్ హసీనా బంగబాబన్ నుంచి మిలిటరీ హెలికాప్టర్ లో బయలుదేరారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి బెంగాల్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బంగ్లా ప్రధాని షేక్  హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 300కి చేరింది. కాగా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు అక్కడ మీడియా కథనాలు వెల్లడించాయి. రిజర్వేషన్ల ఆందోళనలో వందల మంది మృతి చెందిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు.