నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగాలుగా గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ వారు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 27వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు ధూమ్ ధామ్ కార్యక్రమాలను నిర్వహించి ఆట పాటలు ద్వారా కళాకారులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, గజేందర్, రాజరత్నం, సుజాత, అన్నపూర్ణ, వీణరాణి, నవత తదితరులు పాల్గొన్నారు.