12-03-2025 12:27:10 AM
న్యూఢిల్లీ, మార్చి 11: రెండో విడత బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కూడా నిరసనల మధ్యే కొనసాగాయి. డీలిమిటేషన్, హిందీ భాషా, కొత్త విద్యా విధానం మొదలైన అం శాల మీద విపక్ష సభ్యులు నిరసనలు తెలుపుతున్నారు.
మంగళవారం పార్లమెంట్ ఆవ రణలో డీఎంకే ఎంపీలు నల్లకోట్లతో నిరసన తెలియజేశారు. ఇక కేరళకు చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఏప్రిల్ 2 నుంచి అమెరికా సుంకాలు విధించదని ప్రభుత్వం నుం చి హామీ కావాలన్నారు.
ఎవరీ మీదా ఏదీ రుద్దట్లేదు..
హిందీ భాషా వివాదంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ‘ఎవరి మీ దా ఏదీ అనవసరంగా రుద్దట్లేదు. ఇది బహుభాషా సమాజం’ అని తెలిపారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడు తూ.. ‘తమ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. మణిపూర్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడేందుకు మేము కావాల్సిన ఆర్థిక సాయం చేస్తున్నాం.’ అని తెలిపారు.
క్షమాపణలు చెప్పిన ఖర్గే
విద్యాశాఖ పనితీరు మీద చర్చ సందర్బంగా రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. “హమ్ పూరీ తయ్యారీ సే ఆయే.. హైన్ ఔర్ ఆప్‌కో క్యా క్యా తోక్‌నా హై తిక్ సే తోకేంగే” (అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది) అనే హిందీ పదాన్ని ఉపయోగించారు.
రాజ్యసభా పక్ష నేత జేపీ నడ్డా ఖర్గే పదప్రయోగంపై మండిపడ్డారు. దీంతో ఖర్గే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న ట్లు తెలిపారు. తను చైర్మన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు ఖర్గే క్లారిటీ ఇచ్చారు.ఇక డీఎంకే ఎంపీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు.