calender_icon.png 8 January, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టు హత్య ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన

07-01-2025 05:29:23 PM

ఇల్లెందు (విజయక్రాంతి): జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యను నిరసిస్తూ ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. యువ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ చత్తీస్గడ్ రాష్ట్రంలోని బస్తర జిల్లా బీజాపూర్ లో ఒక జాతీయ చానల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడని, రూ.120 కోట్ల రోడ్డు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ అవినీతి కుంభకోణాన్ని వెలికితీయడంతో రోడ్డు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ దారుణంగా జర్నలిస్టు ముఖేష్ ను దారుణంగా హత్య చేశారన్నారు. ముఖేష్ హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు (టియూడబ్ల్యూజె -టిజెఎఫ్ ), ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజేష్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొండ ప్రసాద్, మాటేటి మధు, రాజేష్, నందు, రాధాకృష్ణ, సంతోష్, డానియల్, విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు.