25-04-2025 06:52:12 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రహల్గాంలో తీవ్రవాదుల చర్యలను ఖండిస్తూ శుక్రవారం నస్పూర్ ట్రస్మా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పట్టణంలోని లిటిల్ రోబోస్ పాఠశాలలో మండలంలోని కరస్పాండెంట్లు అత్యవసర సమావేశం నిర్వహించి నిరసన తెలిపారు. ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెత్తుల రాజేంద్ర పాణి మాట్లాడుతూ... పర్యాటకులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగండ్ల ఉపేందర్, జిల్లా గౌరవ అద్యక్షులు బత్తిని దేవన్న, గౌరవ సలహదారులు శ్రీనివాస్, సెక్రటరి సత్యనారాయణ, ట్రెజరర్ రాజ్ కుమార్, ప్రమోద్, రమణ, సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.