హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. హనుమకొండలో జరిగే ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పాల్గొనున్నారు.