జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): నాణ్యతలేని బంగారం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవా రం నిరసన చేపట్టారు. జగిత్యాలలోని స్వర్ణకార సంఘ ఆధ్వ ర్యంలో దుకాణాల బంద్ నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొందరు జువెలరీ షాప్ యజమానులు స్వర్ణకారులను, ప్రజలను మోసం చేస్తూ నాణ్యతలేని బిస్కెట్ బంగారం అమ్ము తున్నారని ఆరోపించారు. జగిత్యాల పట్టణ స్వర్ణకారులకు సాక్షాధారాలు లభిం చడంతో ఇదేంటని వారిని నిలదీస్తే తమపైనే దాడులకు పాల్పడుతున్నారన్నారు.
విజిలెన్స్ అధికారులు స్పందించి నాణ్యతలేని బంగారాన్ని విక్రయిస్తున్న జ్యువెల్లరీ షాపుల్లో సోదాలు నిర్వహించి స్వర్ణకారులకు, ప్రజలకు తగిన న్యాయం చేయాలని కోరారు.