calender_icon.png 4 February, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

04-02-2025 12:00:00 AM

అర్మూర్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి) : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆర్మూర్ పట్టణం అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియచేసారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు.

అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణ ప్రాంత బిజెపి ఎంపీలు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది మంది ఎంపీలు గెలిచి, ఇద్దరు కేంద్ర మంత్రులగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.

ఎంపి అరవింధ్ గతంలో చెప్పినట్టు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం, మిలిటరీ సైనిక్ స్కూల్స్ అని వాగ్ధానం చేయడం జరిగింది. దాన్ని గురించి బడ్జెట్ లో ప్రస్తావన లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ప్రకటించిందో దానినే తీసుకొచ్చానని అర్మూర్  ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడైతే బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయో వాటికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఆర్మూర్ నుంచి అదిలాబాద్ కి రైల్వే లైన్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నా దానికి ఒక రూపాయి పెట్టలేదని వాపోయారు. మోడి గత 11 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందని వాపోయారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ ఛైర్మన్ మార చంద్రమోహన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిర్ధపల్లి సాయి రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ సాయి బాబా గౌడ్, ఆర్మూర్, నందిపేట్ మక్లూర్, డొంకేశ్వర్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి,  మంద మహిపాల్, రవి ప్రకాష్, భూమేష్ రెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇస్సపల్లి జీవన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నాభాయ్, లింగ గౌడ్,  కందేశ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.