calender_icon.png 4 April, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో నిరసన

03-04-2025 10:32:13 PM

ప్రభుత్వం హెచ్సియు భూముల వేలంపాట ఆపాలని నిరసన కార్యక్రమం..

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం మధ్యాహ్నం బీజేవైఎం ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హెచ్సియు భూమిలో జేసీబీలతో చెట్లను తొలగించడం ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి వేలంపాట కార్యక్రమాన్నీ నిలిపివేయాలని నిరసన తెలిపారు. కాంగ్రెస్ హటావో హెచ్సీయూ బచావో, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులతో పెట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.