calender_icon.png 24 January, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోటర్లు తొలగించాలని నిరసన

24-01-2025 12:34:53 AM

రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ పై నిరసన చేపట్టిన గ్రామస్తులు

కరీంనగర్, జనవరి 23(విజయక్రాంతి): చొప్పదండి మండలంలోని రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ పై ఉన్న ఊరు గ్రామస్తులు చెరువులో ఉన్న మోటార్లను తొలగించాలని  రాగంపేట, చిట్యాలపల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో  బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎల్లంపల్లి పైపులైనుండి మినీ ట్యాంక్ బండ్ చెరువు నుండి నీరు పుష్కలంగా ఉండేదని నీరు ద్వారా ఆయకట్టుకు నీరు అంది  సాగు చేసుకున్నామని అన్నారు.

చెరువులో ఇప్పుడు నీరు లేకపోవడంతో చెరువులో ఉన్న కొద్దిపాటి నీటిని చెరువు పై ఉన్న గ్రామస్తులు  మోటార్లు పెట్టుకొని పంపింగ్ చేసుకోవడం వలన  కింది గ్రామాల ఆయకట్టుకు నీరు అందక పంటలు సాగు చేసుకోవడానికి ఇబ్బందుల అవుతున్నాయని  తెలిపారు. అలాగే చెరువులో  నీరు లేక  చెరువులో చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన చెందారు.

ప్రభుత్వం వెంటనే మినీ ట్యాంక్ బండ్ చెరువు నింపి  ఆయకట్టుకు నీరు అందించాలని, కోరారు. సంఘటన స్థలానికి సిఐ ప్రకాష్ గౌడ్, ఎస్‌ఐ అనూష లు వెళ్లి రెండు గ్రామాల గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల గ్రామస్తులు రైతులు, రాగంపేట మత్స్యకారులు తదితరులు  పాల్గొన్నారు