calender_icon.png 5 January, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన ర్యాలీ

04-01-2025 01:22:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3(విజయక్రాంతి): తమ ఉద్యోగాలను రెగ్యుల  చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి సరిత ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం గన్‌ఫౌండ్రీలోని హైదరాబాద్ డీఈవో కార్యాల  నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రతీ ఉద్యోగికి తక్షణమే పేస్కేల్ , జీవిత బీమా, ఆరోగ్య బీమా  రిటైర్మెంట్  బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.