calender_icon.png 27 April, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

26-04-2025 10:53:36 PM

చిలుకూరు: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ చిలుకూరు మండల కేంద్రంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో శనివారం రాత్రి చిలుకూరు బస్టాండ్ సెంటర్ లో, జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ కొవ్వొత్తులతో, నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ... పాక్ కవ్వింపు చర్యలకు భారతదేశం భయపడేది లేదని, పాకు పేరిత ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే ప్రపంచ దేశాలు స్పందించి పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో కనుమరుగయ్యే వరకు తుది మట్టించాలని అన్నారు.

ఇలాంటి చర్యలు జరిగినప్పుడు దేశం మొత్తం ఏకతాటిపై ఉండాలని దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తారతమ్యాలు లేకుండా ముక్తకంఠంతో మనమంతా భారతీయులం అనే నినాదంపై ఒక్కటై ఉండి పాకిస్తాన్ పిరికి చర్యలకు భారతదేశం భయపడదని సంకేతం ప్రపంచ దేశాలకు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.