10-02-2025 07:56:22 PM
సఖి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ..
మణుగూరు (విజయక్రాంతి): రోజు రోజుకి బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. టిడిపి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వ్యవస్థాపకులు అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ, అధికార ప్రతినిధి గోగినేని వరలక్ష్మిలు మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రంలో 13 సంవత్సరాల చిన్నారిపై ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు నెలల తరబడి సామూహిక అత్యాచారం చేసి, గర్భం దాల్చేలా చేయడం దారుణం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా హైదర్ షా కోట్ లో మరో చిన్నారిపై దుండగులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన దుర్మార్గమైందన్నారు. ఈ రెండు సంఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సఖి జాతీయ ఉపాధ్యక్షురాలు జన్న స్వర్ణలత, జిల్లా అధ్యక్షురాలు బత్తుల సుజాత, మహిళా సభ్యులు వేముల స్వరూప, లక్ష్మీబాయి, చోడే లావణ్య రేఖ, గైని మౌనిక, పెంట్యాల దీప్తి, సత్యవతి, రమాదేవి, పుష్ప, పావని, సంధ్యా తదితరులు పాల్గొన్నారు.