రామాయంపేట (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామయంపేట మండలంలోని ఝాన్సీ లింగాపూర్ లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో నిరసన కార్యక్రమం కొనసాగాయి. ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపీడీవో సాజులోద్దీన్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అసలైన అర్హులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.