02-04-2025 12:17:30 AM
కడ్తాల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో ఓ రేషన్ దుకాణం వద్ద కాంగ్రెస్ శ్రేణులు సన్నబియ్యం పంపిణి ప్రారంభోత్సవం చేశారు. దీంతో స్థానిక బిజెపి శ్రేణులు ప్రధాని నరేం ద్ర మోడి ఫోటో లేదని నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన చేస్తు న్న బిజెపి నాయకులను అక్కడి నుంచి పంపించారు.