వరంగల్: నిన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మూడు రోజుల పసిపాపని కుక్కలు పీక్కుతిని మృతి చెందడం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రధాన గేట్ ముందు నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. నిన్న జరిగిన ఈ పసిపాప ఘటన చాలా బాధాకరం, ఎంజీఎం లో మౌళిక సదుపాయలపై శ్రద్ధ పెట్టకుండా ఉండడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగింది. అంతే కాకుండా ఈ సంఘటన ఎంజీఎంలోనే జరిగిన కూడా ఇది ఎంజీఎం ఆసుపత్రి లో జరుగలేదు అని దాటా వేస్తున్న సూపరింటెండెంట్ ని వెంటనే భర్తరప్ చేయాలి, మల్టి సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో కూడా వెంటనే సౌకర్యాలు కలిపించి సేవలు ప్రారంభించాలన్నారు.
సిసి కెమెరాలు నిరూపయోగంగా వున్నాయ్ వెంటనే మరమ్మత్తులు చేసి వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇది పేద ప్రజలు వుండే ప్రాంతం అలాంటి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఆసుపత్రి లో డాక్టర్స్ విధులకు హాజరై బయోమెట్రిక్ పెట్టి వెలితే ఈ ఆసుపత్రి లో సేవలు జరుగకుండా ఉంటే పట్టించుకునే నాథుడే లేడని ఆరోపించారు. కుక్కలు ఇంత విచక్షణ రహితంగా వస్తున్నాయి, అంటే మున్సిపల్ అధికారులు, మున్సిపల్ శాఖ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ ఈ ఎంజిఎం ఆసుపత్రి సరిపోదు అని ముందస్తుగా 24 అంతస్థుల ఆసుపత్రి అత్యంత ఆధునిక సదుపాయలతో పూజ చేసి పనులు ప్రారంభించిన దాని నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిదని ద్వజమెత్తారు. ఈ ఎంజి ఎం ఆసుపత్రిలో సిబ్బందిని, మౌలిక సదుపాయలు కలిపించి ఈ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో ఇలాంటి నిరసన, ధర్నాలు ఇంకా భారీ ఎత్తున నిర్వహిస్తాం అని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయిర్ రిజ్వనా శమిమ్ మాసూద్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మారుపల్ల రవి,మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్,డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.