నిర్మల్, నవంబర్ 28 (విజయక్రాంతి): పంచాయతీల్లో నాడు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల కాకపోవడంతోనే పెంబి మండలానకి చెందిన నాటి సర్పంచ్ పూర్ణచందర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలని జిల్లా మాజీ సర్పంచ్‌ల సంఘం సభ్యులు గురువారం నిర్మల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.
జిల్లావ్యాప్తంగా 396 పంచాయతీలకు చెందిన నాటి సర్పంచ్‌ల్లో కొందరు సొంత డబ్బు వెచ్చించి పనులు చేపట్టారని, బిల్లులు విడుదల కాకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిరసనలో సంఘం అధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.