calender_icon.png 30 October, 2024 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి విద్యుత్ నిలిపివేతను నిరసిస్తూ పాత జిఎం కార్యాలయం ఎదుట ఆందోళన

10-08-2024 03:30:43 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): సింగరేణి అధికారులు కార్మికుల క్వార్టర్లకు విద్యుత్ సరఫరాలు నిలిపివేయడానికి నిరసిస్తూ శనివారం బెల్లంపల్లి పాత జిఎం కార్యాలయం ఎదుట బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ, కన్నాలబస్తీ, బూడిదగడ్డ బస్తీలకు చెందిన మాజీ కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. గత మూడు రోజుల సింగరేణి అధికారులు క్వార్టర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కుటుంబాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత 40 ఏళ్లుగా సింగరేణి సంస్థకు సేవలందించిన కార్మికుల ఇళ్లకు అధికారులు ఉన్నఫలంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని అధికారులను నిలదీశారు. విద్యుత్ సరఫరా నిలిపేయడంతో చిన్న పిల్లలతో పడరాని పాట్లు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు సిద్ధం చెట్టి రాజమొగిలి , మొత్తం మరి సూరిబాబులు మాట్లాడుతూ సింగరేణి అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి కార్మిక వాడల్లో విద్యుత్ సరఫరాని నిలిపివేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు సింగరేణి అధికారులతో విద్యుత్ సరఫరా విషయమే చర్చలు చేశామని, విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు అంగీకరించినట్లు చెప్పారు.