calender_icon.png 10 January, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దతు ధర చట్టం కోసం ధర్నా

09-01-2025 12:48:17 AM

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన

ఖమ్మం, జనవరి 8 (విజయక్రాంతి): మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ కనీస మద్దతు ధర చట్టం చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు విమర్శించారు. 44 రోజులుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న జగజిత్ సింగ్ దల్లేవాళ్ దీక్షను ప్రభుత్వం ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతులతో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ.. మోదీ సర్కార్ కనీస మద్దతు ధరల చట్టాన్ని ప్రకటించేందుకు హామీ ఇచ్చి ఇప్పుడు నల్ల చట్టాల అమలుకు పూనుకుందని అన్నారు. ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయకుంటే ఆందోళనను  కొనసాగిస్తామని హెచ్చరించారు.

అనంతరం కలెక్టరేట్ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్,  రాష్ట్రసమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కె జానీమియా, క్లుమైంట్,  దొండపాటి రమేశ్, గోవిందరావు, వెంకటరెడ్డి, రామ్మూర్తి, తాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.