22-02-2025 01:25:57 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం ధర్నాకు చేశారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఎస్బిఐ బ్యాంక్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు హాజరై తమ నిరసన తెలిపారు.
వారానికి ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలన్నారు బ్యాంకుల్లో త్వరతగతిన శాశ్వత నియమకాలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల గ్రాడ్యుటిని అమల్లోకి తేవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఉద్యోగులు రమేష్ గురునాథ్ ప్రమోద్ శ్రీనివాస్ సుధాకర్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.