19-02-2025 09:18:31 PM
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): కేంద్ర ప్రజా వ్యతిరేక బడ్జెట్ని వ్యతిరేకిస్తూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇల్లందు బస్టాండ్ సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బందం నాగయ్య, సిపిఐ (ఎం) నాయకులు అలేటి కిరణ్, సురేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు సబ్ డివిజన్ కార్యదర్శి బి రాంసింగ్, బిఎన్ కాంతారావు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు నాయిని రాజు, యాకుబ్ షావలి, అజ్మీర బిచ్చ, సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ (వైకె) నాయకులు ఎండి రాసుద్దీన్, మోకాళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.