నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక బడ్జెట్ను నిరసిస్తూ బుధవారం నిర్మల్ లో వ్యవసాయ కార్మికుల సంఘం కిషన్ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బడ్జెట్ కాపీలను ప్రదర్శించారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దేశంలో ఆహార ఉత్పత్తులు తగ్గిపోయి వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రైతులపై ఉన్న ప్రేమను బడ్జెట్ రూపంలో ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రాజన్న నూతన కుమార్ తిరుపతి రామ్ లక్ష్మణ్ ఎస్ ఎన్ రెడ్డి రాజు గంగన్న గఫూర్ తదితరులు ఉన్నారు.