calender_icon.png 31 March, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన

29-03-2025 01:56:08 AM

మహబూబాబాద్, మార్చి28 (విజయ క్రాంతి): వక్ఫ్ సవరణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో హౌసింగ్ బోర్డ్ సీతారాంపురం లో ఉన్న మస్జిద్-ఏ -రహమానియా లో ముస్లింలు శాంతియుత నిరసన చేపట్టారు. మస్జిద్-ఏ  రహమానియా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో  శుక్రవారం నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆల్ పార్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ సదర్ సయ్యద్ సర్వర్,యాకుబ్ పాషా, బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులుసయ్యద్ లతీఫ్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒక్కో బిల్లును ప్రవేశపెడుతోందని విమర్శించారు.

దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి వర్ఫ్ బోర్డు బిల్లుకు సవరణలు చేపట్టిందని దుయ్యబట్టారు.తక్షణం బిల్లును ఉపసంహరించుకోకపోతే దేశంలో లౌకికవాదం పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణం వర్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్సర్, అహ్మద్, బాసిత్ ఖాన్, జాకీర్ హుస్సేన్, అవేజ్,ఘని,అజ్జు, అమీర్ బాబా,నజీమ్,హసేన్,అంజత్ తదితరులు పాల్గొన్నారు.