19-02-2025 12:00:00 AM
నిర్మల్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) ః దేశంలో అధికారులు ఉన్న మోడీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
బడ్జెట్ సంపన్నులకు కొమ్ముకాసే విధంగా ఉందని పేద ప్రజలను కార్మికులను వ్యవసాయ రైతులను విస్మరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న ఎస్‌ఎం రెడ్డి మైముద్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.