calender_icon.png 2 April, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీ తొలగింపుపై నిరసన..

01-04-2025 04:52:48 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా గల మెయిన్ రోడ్డుతో పాటు అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం స్థానిక మైనార్టీ నాయకులు ఏర్పాటుచేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించి చెత్త బండిలో వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి గౌస్ భాయ్ నిరసన తెలిపారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా తాను ప్రేమ్ సాగర్ రావుపై అభిమానంతో పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై కమిషనర్ సమాధానం ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. విషయం తెలిసిన వెంటనే వన్ టౌన్ ఎస్సై రాకేష్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని కాంగ్రెస్ మైనార్టీ నాయకులు వెండి గౌస్ బాయ్ ని సముదాయించడంతో ఆందోళన విరమించారు. తిరిగి మున్సిపల్ సిబ్బంది తొలగించిన ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావు పట్ట ణంలోని అంబేద్కర్ చౌరస్తా, ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది.