25-04-2025 12:30:37 AM
తిమ్మాపూర్,, ఏప్రిల్24: కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడికి తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అల్గునూర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. పెహల్గాంలో ముష్కరుల దాడనిని ప్రతినిధులు ముక్తకంఠంతో ఖండించారు. కాల్పుల్లో మృతిచెందినవారి ఆత్మశాంతి కి మౌనం పాటించారు.
అనంతరం కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ప్రెస్క్లబ్ అద్యక్షుడు బత్తుల రాకేశ్ మట్లాడుతూ కేంద్రం ఉగ్రవాదులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ ప్రెస్ గౌరవాధ్యక్షుడు ముసుకు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు నాగేల్లి ఆంజనేయులు,
అబ్దుల్ రహీం, టియుడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల అనిల్, తిమ్మాపూర్ మండల ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి కొంపెల్లి సతీష్, జాప నాగరాజు, మాతంగి రవీందర్, బొమ్మాడి విజయ్ కుమార్, కొమ్మెర రాజిరెడ్డి, లంక స్వామి, మర్రి రవీందర్, నాయకులు జాప రత్నాకర్ రెడ్డి, సిల్ల పరశురాములు, సింగం శ్రీను, బుర్ర కనకయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.