25-04-2025 05:27:58 PM
భైంసా: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం నిరసిస్తూ శుక్రవారం కుబీర్ మండల కేంద్రంలో మైనార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారు ఈ దాడిని మైనార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారని దేశంలో ఐక్యతకు దెబ్బతీసే విధంగా ఉగ్రవాదులు ఎన్ని దాడులు జరిపిన మైనార్టీలు భారత సమైక్యత కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.