calender_icon.png 26 March, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహం తొలగించవద్దని నిరసన

25-03-2025 01:47:00 AM

రోడ్డు పని పూర్తి అయ్యేవరకు పహారా విజిలెన్స్ సిఐ 

భీమదేవరపల్లి, మార్చి 24( విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో హైవే పై ఉన్న అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలంగాణ అమరవీరుల స్థూపం రోడ్డు నిర్మాణం పనుల్లో తీసివేసి వేరే చోట ఏర్పాటు చేస్తారని వదంతులు వ్యాపించడంతో విగ్ర హం అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలంగా ణ అమరవీరుల స్థూపం తొలగించవద్దని అంబేద్కర్ సంఘం నాయకులు తెలంగాణ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

సోమవారం వేకువజామునుండే హైవే పైన ఉన్న అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలం గాణ స్థూపం తీసివేసి ఆర్టీసీ వారి ముల్క నూర్ బస్టాండ్ స్థలంలో ఏర్పాటు చేస్తారని వదంతులు రావడంతో కరీంనగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ ఎం భూపతిరెడ్డి ఆర్టీసీలోని విజిలెన్స్ పోలీసులు సిఐ రవీందర్ ఎస్త్స్ర రామచంద్రం ఆధ్వర్యంలో విజిలెన్స్ పోలీసులు విస్తృత పహారా ఏర్పాటు చేశారు.

అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడున్న చోటు నుండి ఎక్కడికి తరలిం చబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులకు ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు. కాగా ముల్కనూర్ వద్ద జరుగుతున్న హైవే రోడ్డు నిర్మాణం పనులు ఏప్రిల్ 30లోగా పనులు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య రోడ్డు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

అంబేద్కర్ విగ్రహం తెలంగాణ అమరవీరుల స్తూపం ఎక్కడికి మార్చవద్దని కోరుతూ భీమదేవరపల్లి మండల అంబేద్క ర్ సంఘం నాయకులు జేఏసీ నాయకులు సారయ్య, చెప్పేలా ప్రకాష్ ,తూముల సదానందం ,మాడుగుల అశోక్, ఎల్తూరి ప్రేమ్ రాజ్, మాడుగుల పోచయ్య, గొర్రె సదానందం, గజ్జల రమేష్, పోగుల శ్రీకాంత్ ,ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు .

ఈ సందర్భంగా ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఎట్టి పరిస్థితులలో ముట్టుకోబో మని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏది ఏమైనా అంబేద్కర్ విగ్రహంతో పాటు తెలంగాణ అమరవీరుల స్థూపం తిరిగి వేరే చోట ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.