అదిలాబాద్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లఘు చర్లలో అధికారులపై దాడి నిరసిస్తూ ఆదివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి దాడిని ఖండించారు అధికారులపై దాడులు చేయడం సరికాదని సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా మాజీ చైర్ పర్సన్ రాథోడ్, లంబాడి సంఘ నాయకులు పాల్గొన్నారు.