02-04-2025 01:08:59 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 1 ( విజయ క్రాంతి )సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, బిజెపి, సిపిఎం పార్టీలు ఆందోళనకు దిగాయి. బీజేవైఎం నాయకులు పట్నం కపిల్ కాసుకుంట రమేష్ కటకమోజు ఉషా కిరణ్ లు ఆందోళన చేయడానికి హైదరాబాద్ కు వెళ్తుండగా పట్టణ పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు.
పోలీసులు లాటి చార్జీ చేసి అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను లాఠీ చార్జీలను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జాంగిర్ తీవ్రంగా ఖండించారు. భూముల అమ్మడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన యూనివర్సిటీ విద్యార్థుల పై లాడ్జ్ చేయడం నిర్బంధించడం శోచనీయమని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే హెచ్ యు భూముల అమ్మడాన్ని వెనక్కి తీసుకోవాలని లేనట్లయితే తెలంగాణలో అన్ని రకాల ఉద్యమాలు ప్రారంభమవుతాయి అని హెచ్చరించారు.