calender_icon.png 2 April, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా ఆందోళన

27-03-2025 12:08:06 AM

యుద్ధాన్ని ఆపాలంటూ ఫ్లకార్డుల ప్రదర్శన

గాజా: హమాస్‌కు వ్యతిరేకంగా వందలాది మంది పాలస్తీనియన్లు మంగళవారం నార్త్నన్ గాజా ప్రాంతంలోని బీట్ లాహియా ప్రాంతంలోని వీధుల్లో నిరసన తెలియజేశారు. ‘హమాస్ గోబ్యాక్’ అంటూ ఫ్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. దాదాపు రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబులతో తీవ్రంగా విరుచుకుపడింది. తాజా ఫ్లకార్డుల ప్రదర్శనలో యుద్ధాన్ని ఆపాలని, తాము శాంతిని కోరుకుంటున్నామని అక్కడి ప్రజలు కోరారు.

నిరసన తెలుపుతున్న ప్రజలను ముసుగులు తొడిగిన హమాస్ మిలిటెంట్లు తుపాకీలు, లాఠీలతో బెదిరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. గాజా నగరంలోని పశ్చిమ భాగంలోని జబాలియా శరణార్థి శిబిరాల నుంచి తీసిన కొన్ని ప్రత్యేక ఫుటేజీల్లో డజన్ల కొద్ది నిరసనకారులు టైర్లు తగలబెట్టి యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.