10-04-2025 01:48:53 AM
మెదక్, ఏప్రిల్ 9(విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ముందు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు 2024 నుంచి తగ్గాయని, ఇటీవలి కాలంలో అవి మరింత తగ్గాయని కానీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై రూ.50 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ, సబ్సిడీయేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగే గ్యాస్ ధరల ప్రభావం మిగతా నిత్యవసర వస్తు ధరలపై కూడా పడుతుందని అన్నారు.పెరిగిన గ్యాస్ ధరల వల్ల మహిళలపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీనివల్ల నెలకు జిల్లా ప్రజలపై అదనంగా భారం పడుతుందని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.మల్లేశం, ఎ.మహేందర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, నాయకులు భాను, సత్యం, రాణి, మల్లయ్య, శంకరయ్య పాల్గొన్నారు.