19-02-2025 08:16:37 PM
15వ రోజుకు చేరిన నిరసనలు..
పటాన్‌చెరు: గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్ వద్ద ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా మండల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. గుమ్మడిదల, నల్లవల్లి, కొత్తపల్లిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 15 రోజుకు చేరుకున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ చేపట్టారు. పురుషులు అర్థనగ్నంగా ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపైన భైటాయించారు.
దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నల్లవల్లి గ్రామస్తులు నర్సాపూర్‌లో జరుగుతున్న దీక్షలు మద్దతు తెలిపారు. నల్లవల్లి గ్రామ సమీపంలోని బుగ్గవాగు, బావులను పరిశీలించారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే స్వచ్చమైన బుగ్గవాగుతో పాటు రెండు బావులు కాలుష్యమయమవుతాయని నల్లవల్లి గ్రామస్తుడు మన్నె రామక్రిష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యపు నీరంతా నర్సాపూర్ చెరువులోకి చేరుతుందన్నారు. ప్రభుత్వం ఒకసారి డంపింగ్‌యార్డు ఏర్పాటుపై పునరాలోచించాలని కోరారు.