26-04-2025 05:45:43 PM
హిందుస్థాన్ జిందాబాద్...
అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గమ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 28 మంది మృతికి కారకులైన పాకిస్తాన్ ఉగ్ర వాదులను హతమార్చాలని డిమాండ్ చేస్తూ దాడికి నిరసనగా శనివారం అశ్వారావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అన్ని రకాల వ్యాపారస్తులు, వివిధ పార్టీల మద్దతుతో సంపూర్ణ బంద్ పాటించారు.
అలాగే స్థానిక రింగ్ రోడ్ సెంటర్ నుండి కులమతాలకు అతీతంగా, అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, సిపిఎం, సీపీఐ, జనసేన, ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పాకిస్థాన్ డౌన్ డౌన్ హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నీ పార్టీలా రాజకీయా నాయకులు వ్యాపారస్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.