calender_icon.png 13 March, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొటీన్ విడుదల కిడ్నీ వ్యాధికి సంకేతం

13-03-2025 01:43:22 AM

  1. చెన్నైలో నిర్వహించిన సేపియన్స్ హెల్త్ పౌండేషన్
  2. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం

చెన్నై, మార్చి 12: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ ఈ నెల 11న చెన్నైలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ రాజన్ రవిచంద్రన్ మాట్లాడుతూ అధిక రక్తపోటు, మూత్రంలో ఎక్కువ మోతాదులో ప్రొటీన్ విడుదల వంటివి కిడ్నీ వ్యాధులకు సంకేతమని పేర్కొన్నారు.

ఫౌండేషన్ తాజాగా ఆవిష్కరించిన పరికరం ద్వారా మూత్రంలో ప్రోటీన్ ఎంత మోతాదులో పోతుందనే విషయాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఐటీ ప్రొఫెసర్ కె. కృష్ణకుమార్ మాట్లాడుతూ మూత్రపిండ వ్యాధిలో ఏఐ సహకారం అనే అంశాన్ని వివరించారు.

ఫౌండేషన్ రూపొందించిన సాల్ట్ రిడక్షన్ గైడ్‌ను హీరో సిద్ధార్థ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మ రామచంద్రన్, ఫౌండేషన్ సభ్యుడు సుందర్, క్రేజీ బాలాజీ, కెంప్లాస్ట్ సన్మార్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్‌కుమార్ శంకర్ పాల్గొన్నారు.