13-03-2025 07:48:41 AM
ధర్మ జాగరణ మండల సంయోజక్ గా మచ్చ వీర్రాజు నియామకం
సహ సంయోజక్ లుగా గోరింట్ల వెంకటేశ్వర్లు దల్లి సత్యనారాయణ రెడ్డి
చర్ల,(విజయక్రాంతి): హిందూ ధర్మ ఆచార, విలువల పరిరక్షణే లక్ష్యంగా ధర్మ జాగార సమితి పనిచేస్తుందని జిల్లా ప్రముఖు గుడిపల్లి యాలాద్రి అన్నారు. మండలంలోని పాత చర్ల లో కొలువై ఉన్న శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయం నందు ధర్మ జాగరణ సమితి జిల్లా ప్రముఖ్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమితి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రముఖ్ గుడిపల్లి యాలాద్రి హాజరై మాట్లాడుతూ హిందూ ధర్మ విలువలను కాపాడుతూ హిందూ ధర్మ ఆచార సంప్రదాయాలను పరిరక్షించడమే ధర్మ జాగరణ సమితి యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. అనంతరం ధర్మ జాగరణ సమితి మండల కమిటీని నియమించారు. మండల సంయోజక్గా మచ్చ వీర్రాజు సహ సంయోజక్ లుగా గోరింట్ల వెంకటేశ్వర్లు,దల్లి సత్యనారాయణ రెడ్డి ,గౌరవ సలహాదారులుగా అయ్యంగిరి నాగేశ్వరరావు, మండల హంసకారిణి కార్యకర్తగా కూరపాటి వీర్రాజులను నియమించారు. పాసిగంటి శ్రీదేవి చక్రపాణి పుప్పాల వరలక్ష్మి మడకం దేవయ్య లను కమిటీ సభ్యులుగా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు.