10-04-2025 12:09:32 AM
ఎమ్మెల్యే గడ్డం వివేక్
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 9: రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం క్యాతన్ పల్లి పురపాలకం ఐదో వార్డు అమరవాది గ్రామంలో జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన గ్రామంలో పాదయాత్ర పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వంతో ముప్పు వాట్టిల్లే అవకాశముందని, కమల నాయకులు కులా లు, మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని తను అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త అంజన్ కుమార్, పట్టణ అధ్యక్షు డు పల్లె రాజు, అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.