19-03-2025 02:31:52 AM
మందమర్రి, మార్చి 18 : అటవీ ప్రాంతాల సంరక్షణ మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు అటవీ చట్టాలపై అవగాహన పెంచుకొని అడవులను సంరక్షించు కోవాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (అవడం) సీ రేపతిరెడ్డి ఆన్నారు.
మండలంలోని పొన్నారం గ్రామంలో మంగళవారం మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశాలను పరిశీలించి ఉపాధి కూలీలకు అటవీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 (A)(g) ప్రకారం అడవులను కాపాడుట, వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
అడవులలో జరిగే అగ్ని ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరారు. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (మామిడిగట్టు) కే రమేష్, ఈజీఎస్ ఫీల్ అసిస్టెంట్ ఈద లింగయ్య, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.