calender_icon.png 23 October, 2024 | 8:57 PM

జల వనరులను కాపాడుకోవాలి

23-09-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): జల వనరులను కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలపైనే కాక పౌర సమాజం, స్వచ్ఛం ద సంస్థల పైనా ఉందని ఇన్‌టాక్ జాతీయ పాలకమండలి సభ్యుడు ఎం.వేదకుమార్ అన్నారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్, సివిల్ సొసైటీ గ్రూప్స్, ప్రభుత్వ సిటీ కళాశాల, సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్, ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ సంయు క్త ఆధ్వర్యంలో శామీర్‌పేట లేక్ కెనాల్ వద్ద నిర్వహించిన కృష్ణా ఉపనది వెంబడి నడక (ఎ వాక్ అలాంగ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ రివర్)కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

శామీర్‌పేట సరస్సు చుట్టూ అంద మైన రాతి నిర్మాణాలు, శాసనాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాన్ని 6వ నిజాం మెహబూబ్ అలీ పాషా, 7వ నిజాం హైదరాబాద్ చుట్టపక్కల ఉత్తమమైన సూర్యాస్తమయ ప్రదేశంగా గుర్తించారని కొనియా డారు. చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ,  శామీర్‌పేట సరస్సు పరిరక్షణ ఉద్యమకారుడు రవీంద్రారెడ్డి, సుభాశ్‌రెడ్డి, నరహరి, శోభాసింగ్, కట్టా ప్రభాకర్ పాల్గొన్నారు.