05-03-2025 12:50:02 AM
కల్లూరు, మార్చి 4 : జర్నలిస్టులపై భౌతికంగా, మానసికంగా సోషల్ మీడియా వేదికను చేసుకొని దాడులకు పాల్పడుతున్న చోటా నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్‌ఐ డి హరితకు కల్లూరు మండల జర్నలిస్టు సంఘాలు మంగళవారం ఫిర్యాదు చేశాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తులు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పోలీసు వారు విచారణ జరిపి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.